హుజురాబాద్ లో పోలింగ్ కు మరికొద్దిగంటల సమయం మాత్రమే మిగిలివున్న సమయంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై ప్రజాసంఘాల జేఎసి నాయకులు గజ్జల కాంతం సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరీంనగర్: హుజురాబాద్ పోలింగ్ కు మరికొద్దిగంటల సమయమే మిగిలివుంది. ఓటర్లను ప్రభావితం చేయగల ఈ కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకోడానికి అన్నిపార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజా సంఘాల జెఎసి నాయకులు గజ్జెల కాంతం మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై విరుచుకుపడ్డారు.
మానకొండూరులో గజ్జెల కాంతం మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేవలం ఈటల రాజేందర్ తప్పిదం వల్లే హుజురాబాద్ లో ఉపఎన్నిక వచ్చిందన్నారు. దళితుల భూములు లాక్కొన్న వ్యక్తి ఈటల అని ఆరోపించారు. ఎక్కడ తన అక్రమాలు బయటపడతాయోనని భయపడిన ఈటల మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు.
ఇక తన ప్రయోజనాల కోసమే TRS Party ని వీడి బిజెపి చేరారని ఆరోపించారు. Eatala Rajender ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంవల్ల ఉపఎన్నిక వచ్చిందని... దీనివల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని gajjala kantham అడిగారు.
read more Huzurabad Bypoll: డబ్బులు రాలేవంటూ ఆందోళనకు దిగినవారిపైనా కేసులు: సిపి సత్యనారాయణ
''17 ఏళ్లుగా పదవిలో ఉండి కూడా huzurabad ప్రజలకు ఈటల చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి KCR వల్లే ఆయనకు అన్ని పదవులు దక్కాయి... అయినా హుజురాబాద్ ను పట్టించుకోలేదు. కానీ ఆయనమాత్రం 600 ఎకరాలు, నాలుగు వేల కోట్లు వెనకేసుకున్నారు. అన్ని ఆస్తులు, అంత డబ్బు ఆయనకు ఎక్కడిది?'' అని గజ్జెల కాంతం ప్రశ్నించారు.
''హుజురాబాద్ ప్రజలపైనే కాదు అభివృద్దిపైనా ఈటలకు చిత్తశుద్ధి లేదు. అక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడి అద్వాన్న పరిస్థితిని ఆయన ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. నిజంగానే నియోజకవర్గంపై ఆయనకు చిత్తశుద్ది వుంటే ఆ పని చేసుండేవారు'' అని గజ్జల పేర్కొన్నారు.
''నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలను ఈటల విభజించి పాలించాడు. బిజెపిని గత ఏడు సంవత్సరాలుగా విమర్శించి తిరిగి అదే పార్టీలో చేరాడు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు'' అన్నారు.
read more Huzurabad Bypoll: ఆ పార్టీల డబ్బులు అందలేదంటూ ఓటర్ల ఆందోళన... గొడవకుదిగిన మహిళలు (వీడియో)
''కరీంనగర్ ప్రజలకు ఎంపిగా బండి సంజయ్ ఏం చేసాడో చెప్పాలి. గురువారం సంజయ్ చేపట్టిన రైతు దీక్ష ఓ సిగ్గు మాలిన దీక్ష. రైతులను పిచ్చొల్లను చేస్తుంది బిజెపి. డిల్లీలో రైతులను అరెస్టు చేసి జైలుకు పంపిన ఘనత బిజెపిది. నల్ల చట్టాలు తీసుకొచ్చింది బిజెపి కాదా. వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కాదా. అలాంటిది తిరిగి మీరే రాష్ట్ర ప్రభుత్వంపై నిందమోపడం ఎమిటి'' అంటూ గజ్జల కాంతం మండిపడ్డారు.
''బండి సంజయ్... దమ్ముంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తీసుకెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ధాన్యం కొంటామని మాట ఇప్పించు. అంతేకాని దగాకోరు మాటలు, దొంగ దీక్షలు చేయడం ఇక చాలించు'' అని గజ్జెల కాంతం పేర్కొన్నారు.
