Asianet News TeluguAsianet News Telugu

ఆ కత్తితో నన్ను పొడవటానికి... ప్రగతి భవన్ వేధికగా కుట్రలు: ఈటల సంచలనం

హుజురాబాద్ ఉపఎన్నికల్లో తనను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్రగతిభవన్ వేధికగా కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

Huzurabad Bypoll...  Etela Rajender sensational comments on TRS Government
Author
Huzurabad, First Published Sep 23, 2021, 2:45 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే కులసంఘాలకు భవనాలు నిర్మిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తోందని... ఇది ఆయా కులాలపై టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రేమ కాదన్నారు మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్. కేవతం తనను ఓడించాలనే ఈ జీఓలు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ జీవోల వెనక ఒక కత్తి దాగివుందని... నియోజకవర్గ ప్రజలకోసం గొంతువిప్పిన తనను పొడవటానికి ఈ కుట్ర చేస్తున్నారని ఈటల ఆరోపించారు. 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోపి మధువాని గార్డెన్ లో ఈటల మీడియాతో మాట్లాడారు. తాను మంత్రి పదవి నుండి వైదొలిగి 4 నెలల 22 రోజులు అవుతుందని గుర్తుచేశారు. కేవలం తన ఒక్కడి ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని ప్రగతిభవన్ లో కుట్రలు జరుగుతున్నాయని ఈటల పేర్కొన్నారు. 

''హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో కుల సంఘాలవారిగా మంత్రులు,ఎంఎల్ఏలు దావత్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో స్వయంగా ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఇక ఇతర పార్టీలలో ఉన్న నాయకులను భయభ్రాంతులకు గురిచేసి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారు. ఈ నీచమైన కుట్రలు, కుతంత్రాలు మన గడప కూడా తొక్కడం కాయం. వారి ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దు'' అని ఈటల సూచించారు.  

''దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు కేవలం దళిత ఓట్ల కోసమే వచ్చింది. ధర్మాన్ని పాతరేయడానికే ఈటలపై కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు, మేధావులు గ్రహించాలి. నా వెంటతిరిగే ఎంత మంది నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ లో చేర్చుకున్నా... ఆ మనిషి మీ దగ్గరే ఉన్నా మనసు మాత్రం నావైపే ఉంటుంది'' అన్నారు.

read more  ఎంగిలి మెతుకులు తినే ఓ బాల్క సుమన్... దమ్ముంటే ఓయూకు రా: బోడిగె శోభ సవాల్ (వీడియో)

''గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. విద్యార్థులు ఫీజు రిఎంబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. 57 సంత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తానన్న హామీ ఏమయ్యింది? రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నావు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు ఇవ్వడం  లేదు? మహిళకు పావళా వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగణ డబ్బులున్న రాష్ట్రమయితే  ఒక్క హుజూరాబాద్ లోనే ఎందుకు ఇస్తున్నావు... రాష్ట్రమంతా ఎందుకు ఇవ్వడం లేదు?'' అంటూ ఈటల నిలదీశారు. 

''రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిగ్గు లేకుండా చోద్యం చూస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు. అందువల్లే పండుగలు ఉన్నాయి కాబట్టి ఎన్నిక వాయిదా వేయమని సిఎస్ ద్వారా లెటర్లు రాయిస్తున్నారు'' అని ఆరోపించారు. 

''హుజూరాబాద్ లో తిరుగుతున్న ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గా ప్రజలే భరతం పడతారు. రాష్ట్రంలో భూములు అమ్ముకుంటే తప్ప ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూనే విద్యుత్, ఆర్టీసి ఛార్జీలు పెంచి మరోవైపు నుండి లాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు పెంచడం తప్ప వేరే మార్గం లేదు... ప్రజలకు ఈ విషయం అతి త్వరలో అర్థం అవుతుంది'' అన్నారు. 

''దళిత బందు పథకం ఎప్పటి నుండో అమలు చేసే ఆలోచన ఉంటే రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కట్టే పన్నుల మీద ఆధారపడి ఉంటాయి. ఐకెపి సెంటర్లలో కొనే ధాన్యానికి డబ్బులు కేంద్రం ఇస్తది. దేశమంతా వడ్లను కొనేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎవరి తాత జాగీరు కాదు'' అని ఈటల మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios