Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ ప్లస్, బిజెపి లోకసభ ఫలితం ధీమా

కరీంనగర్ లోకసభ ఎన్నికల ఫలితానికి ఈటల రాజేందర్ చేరిక తోడై హుజూరాబాద్ శానససభ ఉప ఎన్నికల్లో తాము పాగా వేస్తామని బిజెపి నాయకులు ధీమాతో ఉన్నారు. ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ కంచుకోటగా బిజెపి భావిస్తోంది.

Huzurabad bypoll: Eatela Rajender in, BJP banks on 2019 Lok sabha results
Author
Hyderabad, First Published Jun 23, 2021, 10:45 AM IST

హైదరాబాద్: హుజూరాబాద్ శానససభ నియోజకవర్గంలో తాము పాగా వేయగలమని బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితానికి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలోకి రావడం కలిసి వచ్చి, విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్నారు. 

2018 శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైనప్పటికీ, కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో బిజెపికి తక్కువ ఓట్లే వచ్చాయి. కరీంనగర్ లోకసభ స్థానంలో ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మీద విజయం సాధించారు. 

కరీంనగర్ లోకసభ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, మానకొండూరు, హుస్నాబాద్ శాసనసభా స్థానాలు ఉన్నాయి. చొప్పదండి ఎస్సీలకు రిజర్వ్ కాగా, మిగతావన్నీ జనరల్ సీట్లే. 2018 శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన పి. రఘుకు డిపాజిట్ కూడా రాలేదు.

లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 27 వేల ఓట్లు మాత్రమే బిజెపికి వచ్చాయి. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపికి భారీగా ఓట్లు పడ్డాయి. హుజూరాబాద్ ఈటల రాజేందర్ కు కంచుకోట కావడంతో అలా జరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజేందర్ పార్టీలోకి రావడంతో హుజూరాబాద్ లో తాము పాగా వేయగలమని బిజెపి నేతలు భావిస్తున్ారు 

హూజారాబాద్ లో 3.34 లక్షల ఓటర్లు ఉన్నారు. బిజెపి సభ్యత్వం 15 వేల వరకు ఉంది. లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఇల్లంతుకుంట, కమలాపూర్ మండలాల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. కమలాపూర్ ఈటలకు పెట్టని కోట. ఇది తమకు ఈసారి శాసనసభ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios