హుజురాబాద్ ఉపఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్: ఇప్పటికే మంత్రి పదవిని కోల్పోయి ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల ఛాలెంజ్ చేశారు.
వీడియో
హుజూరాబాద్ పట్టణంలో తన హయాంలో కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను మీడియాకు దగ్గరుండి చూపించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దరిద్రపు పాలన సాగుతోందన్నారు. అధికార పార్టీ నాయకులు మాటలు కోటలు దాటుతాయి కానీ కాల్లు మాత్రం గడప దాటవని ఈటల ఎద్దేవా చేశారు.
read more నువ్వు పెద్ద తోపు, తురుం ఖాన్ వి కదా... హుజురాబాద్ చౌరస్తాలో చర్చకు సిద్దమా?: హరీష్ కు ఈటల సవాల్
ఇప్పటివరకు అప్పులు తెచ్చి ఏదో చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ కు వచ్చి ఇక్కడ అభివ్రుద్దే జరగలేదు, డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టలేదని మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు హరీష్ మాటలు ప్రజలు నమ్మివుండచ్చు. కానీ ఇలాంటి చిల్లర ఆరోపణలు, చిల్లర మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎన్ని డ్రామాలు చేసినా,ఎన్ని ప్రేలాపణలు పేలినా హరీష్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం'' అని ఈటల మండిపడ్డారు.
''గత 20ఏళ్లుగా నాతో వున్న ప్రజాప్రతినిధులను నాతో మాట్లాడుతున్నారు. హరీష్ రావు తమను బానిసలు, గుమాస్తాల కంటే అద్వానంగా చూస్తున్నాడని అంటున్నారు. హుజురాబాద్ నియోజకర్గంలోని సర్పంచ్ లు, ఎంపిటీసిలు, కౌన్సిలర్లు, నాయకులు సరయిన సమయంలో హరీష్ రావుకు బుద్ది చెబుతారు'' అని ఈటల హెచ్చరించారు.
