Asianet News TeluguAsianet News Telugu

వాళ్లకు తిన్నది అరుగకనే హుజురాబాద్ ఉపఎన్నిక.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసలు ఈ ఉపఎన్నిక తిన్నది అరుగకనే అని అన్నారు. కేసీఆర్, ఈటల మధ్య వైరంతో ఈ ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు.
 

huzurabad bypoll came because of kcr and etelas says congress leader VH
Author
Hyderabad, First Published Oct 12, 2021, 6:26 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికపై వీ హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. huzurabad bypoll ఎందుకు వచ్చిందో తెలుసా.. తిన్నది అరుగక అని అన్నారు. kcr, etea rajenderల వల్లే ఈ ఉపఎన్నిక అని తెలిపారు. వాళ్లు ఒకరిని ఒకరు పోటీ పడి తిట్టుకుంటున్నారని చెప్పారు. తెల్లారి పేపర్ చూస్తే ఒకవైపు ఈటల, మరో వైపు కేసీఆర్, హరీష్ రావు ఫొటోలు దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి VH పాల్గొన్నారు.

మహిళలు బతుకమ్మ ఆడుతుంటే స్పీడ్‌గా వచ్చి ఆ బతుకమ్మలను తొక్కుకుంటనే ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు పోయిందని విమర్శలు చేశారు. నల్ల చట్టాలను తెచ్చి నరేంద్ర మోడీ రైతుల మెడకు ఉరి తాడు వేశాడని మండిపడ్డారు. ఆ చట్టాలను నిరసించిన రైతులపైకి కారు ఎక్కించి ఆ పార్టీ నేతలు చంపేశారని అన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి, ఆసరా పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పటికీ ఇవ్వలేదని వీహెచ్ దుయ్యబట్టారు. దళితులకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని, అవి కేవలం ఎన్నికల కోసమే కేసీఆర్ ఇస్తున్నాడని ఫైర్ అయ్యాడు. దళిత బంధు లాగానే మిగితా కులాలకూ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

Also Read: Huzurabad Bypoll: ఈటల గెలవాలన్నదే మంత్రి హరీష్ కోరిక కూడా..: ఎమ్మెల్యే రఘునందన్ సంచలనం

తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీ కాలు కడిగి నెత్తిన పోసుకుంటానని కేసీఆర్ అన్నాడని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పేదల ఖాతాలో వేస్తానని హామీనిచ్చాడు. మళ్లీ మాట తప్పాడు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లు లేకుండానే చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూమి ఇచ్చిందని, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని అన్నారు. మరి టీఆర్ఎస్ ఏం ఇచ్చిందని అడిగారు. అందుకే పార్టీ అభ్యర్థి, చదువుకున్న యువ నాయకుడు బల్మూరి వెంకట్‌ను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున బల్మూరి వెంకట్ బరిలోకి దిగారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌లు పోటీ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios