Huzurabad Bypoll: రేపటినుండే ఈటల సానుభూతి డ్రామా షురూ... ఇలా సాగనుంది..: బాల్క సుమన్ సంచలనం
హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ... రేపు(బుధవారం) ప్రచారం ముగిసిన వెంటనే ఈటల రాజేందర్ సానుభూతి డ్రామా మొదలవుతుందని ఆరోపించారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో వాడివేడిగా సాగుతున్న పార్టీల ప్రచారానికి రేపు(బుధవారం) బ్రేక్ పడనుంది. అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటలు ముందుగానే ప్రచారానికి తెరపడనుంది. దీంతో బిజెపి, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.20వేలు ఇవ్వడానికి సిద్దమైందని బిజెపి ఆరోపిస్తోంది. అయితే బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సానుభూతి నాటకాన్ని మొదలు పెడతాడని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ సందర్భంగా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ... రేపు ప్రచారం ముగిసిన వెంటనే సొమ్మసిల్లీ పడిపోయి సానుభూతి పొందాలని ఈటల చూస్తున్నాడని ఆరోపించారు. అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయాలనే కుట్ర కూడా బిజెపి, ఈటల చేస్తున్నాడని balka suman ఆరోపించారు.
వీడియో
''అబద్దాలను ప్రచారం చేయడంలో bjp నాయకులు గోబెల్ ని మించిపోయారు. ఓటర్లను బిజెపి భయబ్రాంతులకు గురించేస్తోంది. ఒక్క huzurabad bypoll కోసం బిజేపీ డైరెక్షన్ లో రెండువేల మంది సాయుధ బలగాలను రంగంలోకి దించారు. ఓడిపోతామనే భయంతోనే బిజెపి నాయకులు డ్రామాలు చేస్తున్నారు'' అన్నారు.
read more Huzurabad Bypoll: అన్నీ ఇలాగే కొనసాగాలంటే... గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి: మంత్రి తలసాని
''telangana తెచ్చినందుకు కేసిఆర్ కథం కావాలా eatala rajender? ఉద్యమ కారుడు gellu srinivas yadav బానిస అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనడం వాళ్ళ అహంకారానికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో kishan reddy ఎక్కడున్నాడు. ఆస్కార్ అవార్డు కేసిఆర్ కి కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, ప్రధాని narendra modi కి ఇవ్వాలి'' అని సుమన్ ఎద్దేవా చేసారు.
''బీజేపీ కి ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్టే. కిరాతకులకు ముత్తాతలు బీజేపీ నాయకులు. నేరస్థుల అడ్డా... బీజేపీ అడ్డా. బీజేపీలో చేరే నాయకులందరు అవినీతి పరులే. కరోనాతో దేహానికి నష్టమయితే బీజేపీతో దేశానికే నష్టం'' అని ఎమ్మెల్యే సుమన్ మండిపడ్డారు.
ఇప్పటికే హుజురాబాద్ లో అన్నిపాార్టీలు వాడీవేడీగా ప్రచారం నిర్వహించాయి. రేపటితో ప్రచారం ముగియనుండటంతో తెెరవెనుక ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బులు, మద్యం పంచడానికి సిద్దమయ్యారంటూ ఓ పార్టీపై మరోపార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో ఈసీతో పాటు పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేసారు.