Huzurabad bypoll: ముగిసిన నామినేషన్ల గడువు, 26 నామినేషన్లు దాఖలు

తెలంగాణలోని హూజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇవాళ్టితో ముగిసింది.

Huzurabad bypoll:26 nominations filed in Huzurabad assebmbly segment

హైదరాబాద్: తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఇప్పటివరకు 26 నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు ప్రకటించారు.నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్దులు మరో సెట్ నామినేషన్లను శుక్రవారం నాడు దాఖలు చేశారు. bjp అభ్యర్ధిగా మాజీ మంత్రి etela rajender,టీఆర్ఎస్ అభ్యర్ధిగా gellu srinivas yadav కాంగ్రెస్ అభ్యర్ధిగా balmuri venkat నామినేషన్లు దాఖలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు గాను  విధుల నుండి తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.  

also read:Huzurabad Bypoll: కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ (వీడియో)

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్  తీసుకొన్న వారే నామినేషన్ దాఖలు చేయాలని నిబంధనలు విధించడంతో నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన  విధుల నుండి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు  ఆందోళన నిర్వహించారు.ఈ నెల 11న నామినేషన్ల పరిశీలించనున్నారు.ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ..

అసైన్డ్ ,దేవాలయ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కేసీఆర్ తన మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  అదే నెల 14న రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న  huzurabad bypoll నిర్వహించనున్నారు.నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.


బద్వేల్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని badvel  స్థానానికి నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. 2019 లో జరిగిన ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి డాక్టర్ వెంకటసుబ్బయ్య విజయం సాధించారు. ఇటీవల కాలంలో వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

also read:Badvel bypoll: బీజేపీ అభ్యర్ధిగా సురేష్ పేరు ఖరారు

ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ dasari sudha బరిలోకి దింపింది.బీజేపీ అభ్యర్ధిగా suresh, కాంగ్రెస్ అభ్యర్ధిగా kamalamma బరిలోకి దిగారు. badvel bypoll లో పోటీకి దూరంగా ఉంటామని tdp , jana sena లు ప్రకటించాయి. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios