హైదరాబాద్: ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను జైలుకు పంపించాడు. ప్రియుడితో తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అయితే, భర్తపై ఆమె వరకట్నం వేధింపు కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 

చంద్రశేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్ నాచారంలో నివాసం ఉంటున్నాడు. సీసీ కెమెరాల టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు.  ఎస్‌ఆర్‌నగర్‌లో ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితకు చంద్రశేఖర్ దగ్గరయ్యాడు. మాయ మాటలు చెప్పి భర్త లేని సమయంలో ఆమెను పార్కులు, సినిమాలు, షాపింగ్‌లకు తిప్పుతూ జల్సా చేసేవాడు.. 

భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త వారిని ఓ రోజు అనుసరించాడు. భార్యను చంద్రశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.