అతనికి భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం ఉంది. ఆ అనుమానం అతనిలో రోజు రోజుకీ బలంగా పాతుకుపోయింది. దీంతో... భార్యపై కోపం కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో నిద్రపోతున్న భార్యను హత్య చేసి.. ఇంటి వెనక గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా శౌలిగౌరారం రూరల్ మండలం నారెగూడెం గ్రామానికి పెండ్యాల కృష్ణ, ప్రభ అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వత అతనికి భార్య ప్రభ (35)పై అనుమానం   కలిగింది. అది కాస్త రోజు రోజుకీ పెరిగిపోయింది. 

ఈ క్రమంలో ఇంటి బయట నిద్రిస్తుండగా ఆమెపై బండరాయి వేసి హత్యచేశాడు. ఇంటి వెనుక ప్రహరీ పక్కన గోతిని తవ్వి మృతదేహాన్ని పూడ్చాడు. మృతురాలి తల్లి బల్గూరి పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించి  నిందితుడిని కట్టంగూరు బస్టాప్‌ వద్ద మంగళవారం అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.