వివాహిత ప్రియుడితో రాసలీలలు ఆడుతుండగా... భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకేముంది... ఆగ్రహంతో ఊగిపోయిన భర్త తన భార్య ప్రియుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్‌ నగర్‌ జిల్లా, రేకులబి తాండకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండ ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉవటున్న రమేష్‌ భార్య శాంతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంగళవారం రాత్రి రాము తన భార్య శాంతితో చనువుగా ఉండడాన్ని గుర్తించిన రమేష్‌ ఆగ్రహంతో కూరగాయలు కోసే కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే మృతి చెందాడు. 

దీంతో భయపడిన రమేష్‌ నేరుగా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.