తన ఇంట్లో.. భార్య ప్రియుడితో కలిసి సరసాలు ఆడుతుండగా.. ఓ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వెంటనే కత్తి తీసుకొని.. భార్య ప్రియుడిని హత్య చేశాడు.  ఈ దారుణ సంఘటన బోనకల్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన విష్ణుకి వివాహమై భార్య, పిల్లలు ఉన్నారు. కాగా.. విష్ణు భార్యతో అదే గ్రామానికి చెందిన ఉపేంద్ర(40) వివాహేతర సబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విష్ణు పోలీస్‌ స్టేషన్‌లో తన భార్యను వేధిస్తున్నాడని ఉపేంద్రపై ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు.

కానీ..యథావిధిగా అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.కాగా.. మంగళవారం విష్ణు పొలం పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గమనించిన ఉపేంద్ర.. విష్ణు ఇంటికి వెళ్లి అతని భార్యతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన విష్ణు వెంటనే ఇంటికి చేరుకున్నాడు. 

గదిలో ఉపేంద్ర తన భార్యతో  ఉండటాన్ని చూసి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. వెంటనే కల్లు గీత కత్తితో ఉపేంద్ర మెడ, కణితిపై విష్ణు దాడి చేశాడు.
ఈ సంఘటనలో అక్కడిక్కడే అతను మృతి చెందాడు. అనంతరం విష్ణు పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.