దారుణం: చెట్టుకు కట్టేసి భార్యను సజీవ దహనం చేసిన భర్త

Husband kills wife in Warangal district
Highlights

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు  తూర్పుతండాలో భార్యను చెట్టుకు కట్టేసి  కిరోసిన్ పోసి నిప్పంటించాడు భర్త. ఆసుపత్రికలో చికిత్స పొందుతూ భార్య రజిత మృతి చెందింది.ఈ ఘటన  వరంగల్ జిల్లాలో  సంచలనం సృష్టిస్తోంది.

వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు  తూర్పుతండాలో భార్యను చెట్టుకు కట్టేసి  కిరోసిన్ పోసి నిప్పంటించాడు భర్త. ఆసుపత్రికలో చికిత్స పొందుతూ భార్య రజిత మృతి చెందింది.ఈ ఘటన  వరంగల్ జిల్లాలో  సంచలనం సృష్టిస్తోంది.

భార్య రజితను చెట్టుకు కట్టేసిన భర్త ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆమెను వరంగల్ ఏంజీఎం ఆసుపసత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ రజిత మృతి చెందింది.

తూర్పుతండాకు చెందిన బానోతు బాలు నిత్యం తాగి వస్తూ భార్య రజితను కొడుతూ ఉండేవాడు. ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి రజితను చెట్టుకు కట్టేసిన బాలు కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడు. 

రజిత తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. వివాహేతర సంబంధం గురించి భర్తను నిలదీసినందుకు ఆమెను భర్త హత్య చేశారని  బంధువులు ఆరోపిస్తున్నారు. . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader