ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. అంతలోనే భార్య ప్రేమ కురిపించాల్సింది పోయి.. అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో మాట్లాడుతోందని..  అక్రమ సంబంధం అంటగట్టాడు. అనంతరం అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ సంఘట పెద్దపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన రేవెళ్లి హరీష్ మూడేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నార్వే గ్రామానికి చెందిన రమాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత భార్య ఎవరితోనో మాట్లాడుతోందంటూ అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవ కూడా పడ్డాడు. అనంతరం వీరు కరీంనగర్ లోని అజ్మత్ పురాకి ఇళ్లు మారారు. అయినా.. అతని తీరులో మార్పు రాలేదు. భార్యపై అనుమానం రోజు రోజుకీ పెంచుకున్నాడు. ఈ నెల 21వ తేదీన భార్య రమాదేవి నద్రిస్తున్న సమయంలో హరీష్ గొంతు నులిమి హత్య చేశాడు. 

అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి మృతదేహాన్ని సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి ఊర చెరువు సమీపంలో పడేశాడు. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గుర్తు తెలియని మహిళ మృత దేహంగా పోలీసులు గుర్తించి మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించింగా మహిళ కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పెద్దపల్లి ఏసీపీ వెంకట రమణ రెడ్డి, సుల్తానాబాద్ సిఐ మహేంధర్, ఎస్ ఐ రాజేశ్ లు 48 గంటల లోనే నిందితుడుని గుర్తించి అరెస్టు చేశారు.