Asianet News TeluguAsianet News Telugu

భర్తకు నిద్రమాత్రలిచ్చి హత్య.. స్మశానంలో బయటపడిన భార్య అక్రమ సంబంధం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళితే... సిఖ్‌విలేజ్ చందూలాల్ బౌలికి చెందిన ఇంతియాజ్ ఖాన్ అలియాస్ బాబాఖాన్ స్థానికంగా టైలర్‌గా పనిచేస్తున్నాడు.

husband killed by wife due to extra marital affair
Author
Hyderabad, First Published Feb 8, 2019, 12:10 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళితే... సిఖ్‌విలేజ్ చందూలాల్ బౌలికి చెందిన ఇంతియాజ్ ఖాన్ అలియాస్ బాబాఖాన్ స్థానికంగా టైలర్‌గా పనిచేస్తున్నాడు.

పన్నెండేళ్ల క్రితమే భార్య ముగ్గురు పిల్లలను వదిలేసిన బాబాఖాన్ ఉప్పల్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలో బీరప్పగూడకు చెందిన జహేదా బేగంను రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లయ్యే నాటికి జహేదాకు ఇద్దరు పిల్లలున్నారు.

ఈ క్రమంలో జహేదాకు కొంతకాలం క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లి హెచ్‌ఏల కాలనీకి చెందిన ఉబర్ ఫుడ్ డెలివరీ బాయ్ సయ్యద్ ఫయాజ్ అలంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బాబాఖాన్‌ దృష్టికి వెళ్ళడంతో అతను జహేదాను మందలించడంతో ప్రతిరోజు శారీరకంగా , మానసికంగా హింసించాడు.

అక్కడితో ఆగకుండా మొదటి భర్త ద్వారా జహేదాకు పుట్టిన కూతురిపట్ల కూడా బాబాఖాన్‌ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు రోజు రోజుకి ఎక్కువ కావడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించి, ప్రియుడు ఫయాజ్‌ సహకారం కోరింది.

దీనిలో భాగంగా గతేడాది నవంబర్ 15న రాత్రి 11 గంటల సమయంలో బాబాఖాన్‌కు బ్లాక్‌టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక జహేదా, ఫయాజ్‌తో పాటు అతని మిత్రులతో కలిసి గొంతునులిమి చంపేశారు.

తర్వాతి రోజు ఉదయం భర్త ఎంతకు నిద్ర లేవడం లేదంటూ జహేదా పొరుగున్న ఉన్న ఓ నర్సు‌కు చెప్పింది.. ఆమె వచ్చి బాబాఖాన్‌ను పరిశీలించగా అతను చనిపోయినట్లు చెప్పింది. ఏడుపు నటిస్తూ విషయాన్ని బంధువులకు చెప్పింది.

అదే రోజు సాయంత్రం బషీర్‌బాగ్‌లోని స్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో బాబాఖాన్ గొంతుపై గాయాలను గుర్తించిన అతని సోదరుడు వదిననను గట్టిగా నిలదీయగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది.

దీంతో ఆ గాయాలను ఫోటో తీసిన బాబాఖాన్ సోదరుడు ఫజ్జుఖాన్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్‌ 21న బాబాఖాన్ మృతదేహానికి పోస్ట్‌మార్గం నిర్వహించారు.

వైద్యుల నివేదికలో బాధితుడిని గొంతునులిమి చంపినట్లు తేలడంతో మరింత లోతుగా విచారించారు. ఈ క్రమంలో జహేదాతో పాటు ఆమె ప్రియుడు ఫయాజ్ ‌అతని మిత్రులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios