Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో ట్రిపుల్ తలాక్ కేసు : ఫోన్‌లో తలాక్ చెప్పిన భర్త

 నగరంలోని పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు చోటు చేసుకొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. అమెరికాలో ఉంటున్న బాధితురాలి భర్త అది వలీ ఫోన్లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. 

Husband gave triple talaq from US over phone: Hyderabad woman lns
Author
Hyderabad, First Published Dec 10, 2020, 10:44 AM IST

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు చోటు చేసుకొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. అమెరికాలో ఉంటున్న బాధితురాలి భర్త అది వలీ ఫోన్లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. నగరంలోని పాతబస్తీకి చెందిన 24 ఏళ్ల ఫాతిమా అనే మహిళకు ఆమె భర్త అదివలీ ఫోన్ లో తలాక్ ఇచ్చాడు.

సోమాలియాలో జన్మించి అమెరికాలో ఉంటున్న అదివలీ పాతబస్తీకి చెందిన సబా ఫాతిమాను  పెళ్లి చేసుకొన్నాడు. హైద్రాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఫాతిమాను  2015 జనవరిలో పెళ్లి చేసుకొన్నాడు. ఆ సమయంలో అతను హైద్రాబాద్ లో ఉన్నాడు.

ముస్లిం సంప్రదాయాల ప్రకారంగా పెళ్లి చేసుకొన్నట్టుగా బాధితురాలు చెప్పారు. పెళ్లి తర్వాత మలక్‌పేట, టోలిచౌకిలలో అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు.

తన భర్త దేశాన్ని వదిలి వెళ్లినట్టుగా ఆమె చెప్పారు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి ఆయన హైద్రాబాద్ కు వస్తున్నట్టుగా ఆమె చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హైద్రాబాద్ కు వచ్చినట్టుగా ఆమె చెప్పారు.

అప్పటి నుండి ఆయన హైద్రాబాద్ కు రాలేదని ఆమె చెప్పారు. అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్నాడని బాధితురాలు చెప్పారు.అమెరికా నుండి తన ఖర్చుల కోసం భర్త డబ్బులు పంపేవాడని ఆమె తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీన ఫోన్ చేసి తలాక్ చెప్పాడన్నారు.

అప్పటి నుండి ఆయన తనకు టచ్ లో లేడని ఆమె చెప్పారు.తన నెంబర్ ను అతను బ్లాక్ లో పెట్టాడని ఆమె చెప్పారు.దుబాయ్ లో ఉంటున్న తన అత్త, లండన్ లో ఉంటున్న తన ఆడపడుచుకు ఈ విషయం చెప్పి తనకు న్యాయం చేయాలని కోరినట్టుగా ఆమె చెప్పారు. అయితే వారిద్దరూ కూడ తనకు న్యాయం చేస్తారని హమీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత వీరిద్దరికి తాను ఫోన్ చేస్తే తన ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశారని బాధితురాలు చెప్పారు.

తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖను కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios