Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన ఆర్నెళ్లకు ప్రియురాలితో భర్త జంప్.. ఆ భార్య చేసిన పనికి ఊరంతా మద్దతు..

మహేష్  ఈనెల 10న చెకప్ కోసం ఆస్పత్రికి వెళుతున్నాను అని చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు రాలేదు. భీమనపల్లిలో యువతి కూడా లేదు.  దీంతో అతడి భార్య ఈనెల 13న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మిస్సింగ్ కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు మహేష్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

husband eloped with lover after six months of marriage, wife protest in front of house in nalgonda
Author
Hyderabad, First Published Jan 20, 2022, 11:36 AM IST

నల్గొండ :  జీవితాంతం తోడు ఉంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన ఓ వ్యక్తి  ఆరు నెలలకే wifeను వదిలేసి loverతో ఉడాయించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఆనంగళ్ల మహేష్ (30)కు ఖైతాపురం గ్రామానికి చెందిన 26ఏళ్ల యువతితో గత ఏడాది జూన్ 4న marriage జరిగింది. 

అప్పటి నుంచి మహేష్ సదరు యువతితో బాగానే కాపురం చేశాడు. నిరుడు డిసెంబర్ 31న భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన యువతితో కలిసి బైక్పై పారిపోతూ దేశ్ ముఖి వద్ద అదుపు తప్పి కింద పడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి మహేష్ ను అతని కుటుంబ సభ్యులు, ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.  

మహేష్  ఈనెల 10న చెకప్ కోసం ఆస్పత్రికి వెళుతున్నాను అని చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు రాలేదు. భీమనపల్లిలో యువతి కూడా లేదు.  దీంతో అతడి భార్య ఈనెల 13న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మిస్సింగ్ కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు మహేష్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

దీంతో మహేష్ భార్య మల్కాపురంలోని అతని ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులను బయటకు పంపించి.. ఇంటికి తాళం వేసి  ఇంటి ఎదుట  బంధువులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఆందోళనకు దిగింది.  రోజంతా ఇంటి ఎదుట బైఠాయించింది. సాయంత్రం ఎస్ఐ మానస వచ్చి ఆమెతో చర్చించారు. 

మహేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తాళం తీసి ఇంట్లోకి వెళ్లాలని, న్యాయం చేస్తానని చెప్పారు. అందుకు యువతి ఒప్పుకోలేదు. ఇన్ని రోజులుగా ఎందుకు పట్టుకోలేదని, మహేష్ ఎక్కడున్నాడో కుటుంబ సభ్యులకు తెలుసునని పేర్కొంది. నా భర్త నాకు కావాలని, తాను ఎక్కడికి వెళ్లేది లేదని చెప్పింది. గ్రామస్తులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. 

ఇదిలా ఉండగా నిరుడు డిసెంబర్ 10న జనగామలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జ‌న‌గామ జిల్లాలోని ర‌ఘునాథప‌ల్లి మండ‌లం ప‌రిధిలో ఉన్న రామ‌న్న‌గూడెంకు చెందిన న‌ర్సిరెడ్డి - సునీత (38) దంప‌తులు వ్య‌వ‌సాయం చేసేవారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే న‌ర్సిరెడ్డి ఓ ఏడాది కాలంగా ఓ మహిళ‌తో చ‌నువుగా ఉండ‌టాన్ని సునీత గుర్తించింది. వివాహేతర సంబంధాన్ని మానుకోవాల‌ని సునీత త‌రచూ న‌ర్సిరెడ్డితో గొడ‌వప‌డుతూ ఉండేది. 

ఎన్ని సార్లు చెప్పినా.. భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో భార్య మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో ఉరి వేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. భ‌ర్త వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం పొలం వ‌ద్ద‌కు ఉద‌యం వెళ్లాడు. సాయంత్రం తిరిగి వ‌చ్చేస‌రికి సునీత దూలానికి ఉరివేసుకొని క‌నిపించింది. దీంతో న‌ర్సిరెడ్డి తీవ్రంగా రోదించాడు. స్థానికులు గ‌మ‌నించి అక్క‌డికి చేరుకున్నారు. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  సునీత బంధువులు ఘ‌ట‌నా స్థ‌లంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. వేరే మ‌హిళ‌ల‌తో సంబంధానికి సునీత అడ్డుగా ఉంద‌ని త‌మ కూతురు అడ్డంగా ఉంద‌నే చంపేశార‌ని సునీత త‌ల్లిదండ్రులు ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios