అనారోగ్యంతో భార్య ఎక్కడ చనిపోతుందని.. భయంతో భర్త ఆత్మహత్య...
భార్య ఎక్కడ చనిపోతుందో అనే భయంతో ఓ భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : health issuessతో భార్య చనిపోతుందనే భయంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. chilakalaguda పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామానికి చెందిన కొమురయ్య (55) భార్య సత్తెమ్మ తీవ్ర అనారోగ్యంతో Gandhi Hospitalలో చేరారు. ఏప్రిల్ 29న వైద్యులు పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆరో అంతస్తులోని వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు భార్య ఆరోగ్యం బాగాలేదు. పక్కవార్డులో రోగులు చనిపోతున్న వారిని చూసి కొమురయ్య చలించాడు. తన భార్య చనిపోతుందనే భయంతో భవనం మీదినుంచి దూకి suicide చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కొమురయ్య కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా, రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో సమీప బంధువు భార్యతో సహజీవనం చేస్తూ చుట్టాల నుంచి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి suicide చేసుకున్నాడు. బోయిన్ పల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత్ (37) రెండేళ్లుగా న్యూ బోయిన్ పల్లి బాపూజీనగర్ లో ఉంటూ ఓ Rehabilitation Centerలో పనిచేస్తున్నాడు. తన సమీప బంధువు wife (28)ను స్వగ్రామం నుంచి తీసుకొచ్చి బాపూజీనగర్ లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు.
గురువారం రాత్రి తమ్ముడు హరీంద్ర ఆకాశ్ తో కలిసి మద్యం తాగాడు. ఇంటికొచ్చి ఉక్కపోతగా ఉందని బంగ్లా మీదికి వెల్దామని సహజీవనం చేస్తున్న మహిళతో చెప్పాడు. ఆమె బయటకు వెళ్లగానే లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఆమె హరీంద్రకు ఫోన్ చేసింది. అతను వచ్చి వెంటిలేటర్ నుంచి చూసేసరికి సంజీత్ కిటికీకి ఉరేసుకుని కనిపించాడు. హరీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సహజీవన విషయమై బంధువుల ఒత్తిడి ఎక్కువవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.