కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చిన తానుకూడా సూసైడ్ చేసుకున్నాడో ఓ వ్యక్తి. ఈ దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
అమీర్ పేట : మద్యంమత్తు రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కట్టుకున్న భార్యను చంపిన ఓ తాగుబోతు చివరకు తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఎర్ర జనార్ధన్(40), ప్రేమలత(35) దంపతులు నివాసం వుంటున్నారు. వీరికి నిఖిల్(17), నిఖిత(16) సంతానం. భార్య ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తుండగా భర్త కూలీపనులు చేసుకుంటూ కుంటుంబ పోషణ చూసుకునేవారు. అయితే తాగుడుకు బానిసైన జనార్ధన్ పనిచేయడం మానేసి డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
నిన్న (మంగళవారం) తల్లిదండ్రులు పెళ్ళిరోజు వుండటంతో భర్త పిల్లలతో కలిసి ప్రేమలత పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి వేడుకలో పాల్గొన్న ప్రేమలత అర్దరాత్రి భర్తతో కలిసి ఇంటికి వెళ్లింది. పిల్లలిద్దరు అమ్మమ్మవారి ఇంట్లోనే వుంటామంటే అక్కడే వదిలిపెట్టి దంపతులిద్దరే ఇంటికి వెళ్లారు.
Read More కరీంనగర్ లో విషాదం.. నెలల క్రితం కోడలు, మూడు రోజుల కిందట కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి మృతి..
అయితే ఉదయం కొడుకు కోడలు గదిలోంచి బయటకు రాకపోవడంతో జనార్ధన్ తల్లి లోపలికి వెళ్లిచూసి షాకయ్యింది. కోడలు ప్రేమలత రక్తపుమడుగులో పడివుండగా కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె గదిలోంచి బయటకువచ్చి ఇరుగుపొరుగు వారికి విషయం తెలిపింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోలీసులు దంపతుల మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో భార్య తలపై ఇనుపరాడ్డుతో కొట్టిచంపి ఆ తర్వాత భర్త కూడా సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.
