వంట చేస్తున్న భార్య మీద డీజిల్ పోయడంతో మంటలు అంటుకుని భార్య తీవ్రంగా గాయపడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో చోటు చేసుకుంది. 

మహబూబ్ నగర్ : ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా డీజిల్ పోసి మరీ నిప్పంటించాడు. వనపర్తిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వంట చేస్తున్న భార్య మీద డీజిల్ పోయడంతో మంటలు అంటుకుని భార్య తీవ్రంగా గాయపడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో చోటు చేసుకుంది. 

ఎస్ఐ రాజు కథనం ప్రకారం... మండలంలోని చిలకటోనిపల్లికి చెందిన రాధిక(20)ను ఏడాది క్రితం వీరాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్ కు చేశారు. పెళ్లి కట్నంగా రూ.50వేలు, రెండున్నర తులాల బంగారం కుదుర్చుకున్నారు. 

పెళ్లిరోజు కట్నం డబ్బులు రూ. 50వేలు మాత్రమే రమేష్ కి ఇచ్చారు. దీంతో కొంతకాలంగా బంగారం తేవాలని రాధికమీద ఒత్తిడి తేవడం, అదనంగా కట్నం కావాలని ఇబ్బంది పెట్టేవాడు. మంగళవారం రాత్రి రాధిక ఇంటిముందు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఈ క్రమంలోనే రమేష్ కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న డీజిల్ డబ్బాను తెచ్చి ఒక్కసారిగా రాధిక ఒంటిమీద పోశాడు. పక్కనే ఉన్న మంట అంటుకుంది. తాళలేని ఆమె అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న రాధికను వెంటనే వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ రాజు ఆస్పత్రికి వెళ్లి రాధఇకతో వాంగ్మూలం తీసుకున్నారు. ఈ మేరకు హత్యాయత్నం, గృహహింస, వరకట్నం వేధింపుల చట్టం కింద భర్తపై కేసు నమోదు చేశామన్నారు. వీరిక రెండు నెలలబాబు ఉన్నాడని ఎస్ఐ తెలిపారు.