డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది భార్య. ఇది మనసులో పెట్టుకున్న భర్త  భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 24న ఫాతిమా తల మీద దుడ్డు కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్ ఖాన్, పూజన్ లతో కలిసి పథకం రచించాడు. 

నిజామాబాద్ : విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్నwifeనే కడతేర్చాడో ప్రబుధ్దుడు. తల మీద కట్టెతో కొట్టి హతమార్చిన భర్త.. deadbodyన్ని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చేశాడు. పూర్తిగా కాలకపోవడంతో murder విషయం బయటకు వచ్చింది. 

రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సరదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని బల్ రాం పూర్ జిల్లాకు చెందిన ఫాతిమా ఖాతూన్ (26), రంజాన్ ఖాన్ దంపతులు ఉపాధి కోసం మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతానికి వలస వచ్చారు. 

వీరికి నలుగురు పిల్లలు.. కూలీ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వారు. అయితే, ఫాతిమాకు విలాసవంతంగా బతకాలనే ఆశ ఉండేది. ఇందుకోసం డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది. ఇది మనసులో పెట్టుకున్న భర్త రంజాన్ ఖాన్ భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 24న ఫాతిమా తల మీద దుడ్డు కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్ ఖాన్, పూజన్ లతో కలిసి పథకం రచించాడు. 

అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొలెరో వాహనంలో మృతదేహాన్ని తీుకుని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారుకు చేరుకున్నారు. పంట పొలాల్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అయితే, పొలాల్లోకి వెళ్లిన రైతులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా, sangareddyలో మరో దారుణం జరిగింది. అత్త నిత్యం తిడుతుందని ఆగ్రహించిన అల్లుడు… అత్తను హత్య చేశాడు ఆ తరువాత టీకా వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురై మరణించిందని బంధువులను నమ్మించాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఒంటిమీద గాయాలు కనిపించడంతో గ్రామస్తులు నిలదీయగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలం నాగపూర్ లో చోటుచేసుకుంది.

గ్రామీణ సిఐ ఎస్. శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ కు చెందిన కటకం బాలమ్మ (65) కుమారులు లేరు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహాలు జరిగాయి. పెద్ద కూతురు లక్ష్మి భర్త బాగయ్యను ఇల్లరికం తెచ్చుకుంది. బాగయ్యది పుల్కల్ మండలం మంతూరు. బాగయ్య మూడు రోజుల క్రితం భార్య, పిల్లలను మంతూర్ లో వదిలిపెట్టి వచ్చాడు.

పొదుపు సంఘం డబ్బులు చెల్లించాలని చెప్పి నాగపూర్ వచ్చాడు. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నావని బాగయ్యను అత్త బాలమ్మ మంగళవారం రాత్రి బాగా తిట్టింది. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన భాగయ్య అతని గొంతు నులిమి హత్య చేశాడు. కరోనా టీకా తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిందని బుధవారం అందరినీ నమ్మించాడు.

తన భార్య, బంధువులకు సమాచారం ఇచ్చాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా గొంతు, ఒంటిపై గాయాలున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. బాగయ్యను అనుమానించి.. ఓ గదిలో బంధించి గట్టిగా నిలదీశారు. దీంతో అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయనను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు.