నిఖిల్ నిత్యం భార్యను అనుమానించేవాడు. ఈ కారణంగా మంగళవారం ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  ఈ క్రమంలో ఆమె గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు.  ఆ తర్వాత  స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న భర్తే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను చున్నీతో హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన మంగళవారం కుంటాలలో చోటుచేసుకుంది.

సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం అందుకూర్ గ్రామానికి చెందిన కట్ట నిఖిల్ మండల కేంద్రంలో మూడేళ్లుగా బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. నిఖిల్ కు ఈ ఏడాది జనవరి 8న బైంసా మండలంలోని కామోల్‌ గ్రామానికి చెందిన విజయ–గంగాధర్ దంపతుల కుమార్తె గౌతమి (18) తో వివాహం జరిగింది.

వీరు కుంటాలలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.నిఖిల్ నిత్యం భార్యను అనుమానించేవాడు. ఈ కారణంగా మంగళవారం ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే పరిశీలించారు.

తహసీల్దార్‌ శ్రీధర్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించగా.. ట్రైనీ ఎస్సై షరీఫ్‌ కేసు నమోదు చేసుకున్నారు. అయితే గౌతమిని హత్యతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

తమకు న్యాయం చేయాలని, గౌతమి ని హత్య చేసిన నిఖిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు కల్లూర్‌–కుంటాల రహదారిపై ధర్నా చేపట్టారు. సీఐ అజయ్‌బాబు సంఘటనా స్థలానికి వెళ్లి మృతురాలి బంధువులకు నచ్చజెప్పడంతో రాత్రిపూట ఆందోళన విరమించారు.