వరలక్ష్మిని చంపింది భర్తే.. ఫ్యాన్ కు ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ...
కరీంనగర్ లో కలకలం రేపిన వరలక్ష్మి మృతి కేసులో భర్తనే నిందితుడని పోలీసులు తేల్చారు. అతడిని అరెస్ట్ చేశారు.
కరీంనగర్ : కరీంనగర్లో జరిగిన వరలక్ష్మి అనే మహిళ హత్య కేసులో ఆమె భర్తే నిందితుడిగా పోలీసులు తేల్చారు. కరీంనగర్లోని సాయి బాలాజీ నగర్ లో వరలక్ష్మి (33) అనే మహిళ హత్య కేసు కలకలం సృష్టించింది. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన త్రీ టౌన్ పోలీసులు వరలక్ష్మి భర్తను నిందితుడుగా తేల్చి, అరెస్టు చేశారు. అతడిని రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లికి చెందిన సుత్రాల వరుణ్ కుమార్ కు, రామగుండం మండలంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మికి పెళ్లి చేశారు పెద్దలు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వరుణ్ కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల వరుణ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఉన్న ఆస్తులన్నీ కరిగించాడు.
కాంగ్రెస్ కు ఊహించని షాక్.. తుక్కుగూడ సభకు అనుమతి నిరాకరణ..
మద్యానికి డబ్బులు లేక భార్య నగలు కూడా తాకట్టు పెట్టాడు. మద్యం మత్తులో నిత్యం భార్యతో గొడవలు పడుతూ హింసకు గురి చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 5వ తేదీ రాత్రి నగలు విడిపించే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవతో కోపోద్రిక్తుడైన వరుణ్ కుమార్ భార్యను గొంతు నులిమి చంపేశాడు.
తర్వాత వరలక్ష్మిని ఫ్యానుకురేశాడు. ఆత్మహత్యంగా చిత్రీకరించాలని చూశాడు. మృతురాలి తల్లి వరలక్ష్మి భర్తపై అనుమానం ఉందని చెప్పడంతో విషయం వెలుగు చూసింది. ఆమె వరలక్ష్మీని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని.. దీనికి అతని కుటుంబ సభ్యులు సహకరించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
వారి దర్యాప్తులో వరుణ్ కుమార్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో… అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో వరుణ్ కుమార్ నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం నాడు కోర్టులో హాజరపరిచారు. న్యా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఉన్నతాధికారులు ఈ కేసును త్వరగా ఛేదించిన త్రీటౌన్ పోలీసులను అభినందించారు.