Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు ఊహించని షాక్.. తుక్కుగూడ సభకు అనుమతి నిరాకరణ..

సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ తుక్కుగుడలో నిర్వహించనున్న జయభేరీ సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆలయ స్థలంలో రాజకీయ సభ నిర్వహణకు అను మతినివ్వలేమని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. 
 

Officials Denied Permission to Congress Meeting in tukkuguda KRJ
Author
First Published Sep 9, 2023, 5:12 AM IST

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన విజయభేరి సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.  సభ నిర్వహించే స్థలం .. దేవాదాయ శాఖకు చెందిన భూమి కావడంతో రాజకీయ సభ నిర్వహణకు అనుమతినివ్వలేమని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గుక్రవారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ -1988లోని సెక్షన్ 5, 6 ప్రకారం గూడులు, ప్రార్థనా మందిరాల పక్కన రాజకీయ సభలకు అనుమతి ఇవ్వరాదని, అందుకే కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వడం లేదని వారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వాస్తవానికి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జయభేరి పేరిట కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. తొలుత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అదే రోజు ఇతర పార్టీల సభ్యులు ఉండడంతో అనుమతులను నిరాకరించారు. కాగా తుక్కుగూడ వద్ద 50 ఎకరాల భూమిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది.

రెండు రోజుల క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పలువురు కాంగ్రెస్ నేతలు తుక్కుగూడ  సభకు అనువైన స్థలమని భావించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ పరిశీలించారు. కానీ తాజాగా ఆ భూమి దేవాదాయ శాఖకు చెందిందని దాన్ని ఇలాంటి రాజకీయ సమావేశాలకు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆ భూమికి పక్కనే ఉన్న ప్రైవేటు వ్యక్తులు స్థలంలో సవరణ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios