ఘట్ కేసర్ వద్ద అద్భుతమైన వందేళ్ల కట్టడం సినిమా, సీరియల్ షూటింగ్ ల స్పాట్ ఇక్కడి మినార్ నుంచి చూస్తే చార్మినార్ కనిపిస్తది డిబిఆర్ మిల్స్ ఓనర్ విశ్రాంతి భవనమే ఇది
ఘట్కేసర్ దగ్గర కొండాపూర్ లో దాదాపు వందేళ్ల క్రితం నాటి నిర్మాణం ఇది. వెంకీ తో పాటు చాలా సినిమాల షూటింగ్ జరిగాయట ఇందులో. ఇప్పుడు టివి సీరియల్స్ షూటింగ్ లు జరుగుతుంటాయి.
dbr మిల్ నిర్మించిన దివాన్ బహద్దూర్ రాం గోపాల్ జగిర్ధార్ ఇది. ఆ రోజుల్లో విశ్రాంతి మందిరంగా దీనిని నిర్మించు కొన్నారట. ఇక్కడ వంద మిటర్ ల ఎత్తు మినార్ ఉండేది. దాని పై నుంచి చూస్తే చార్మినార్ కనిపించేదట.
పాత సినిమా లో జమిందార్ ఇల్లు చూసినట్టు ఉంటుంది దీని రాజసం. అనంతర కాలంలో జైన్ అనే ఆయన దీన్ని కొనుగోలు చేసి వాస్తు కోసం మినార్ ను కూల్చేశారు. లోనికి అనుమతించడం లేదు.
అయితే ఒక సీనియర్ జర్నలిస్టు దూరం నుంచే ఈ అద్భుత కళాఖండాన్ని ఫోటో తీసుకున్నారు. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్బంగా ఈ ఫొటోను తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.
ఆ అద్భుతమైన చిత్రాన్ని అందరికి పంచే ఉద్దేశంతో ఏసియా నెట్ ఈ పోస్టును అందిస్తున్నది.
