బండి సంజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు: జేబీఎస్‌కి బీజేపీ నేత వెళ్లకుండా అడ్డుకునే యత్నం
తెలంగాణ ఆర్టీసీ డీజీల్ సెస్ పెంపును నిరసిస్తూ బీజేపీ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది. జేబీఎస్ లో ప్రయాణీకులతో బీజేపీ ముఖాముఖికి ప్లాన్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి బండి సంజయ్ వెళ్లకుండా పోలీసులు సంజయ్ ఇంటికి భారీగా చేరుకున్నారు.
హైదరాబాద్:BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ జేబీఎస్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు పోలీసులను మోహరించారు.
Telangana ఆర్టీసీ Diesel Cess పేరుతో ప్రయాణీకులపై భారం మోపడంపై బీజేపీ శుక్రవారం నాడు నిరసనలకు పిలుపునిచ్చింది.జేబీఎస్ లో ప్రయాణీకులతో ముఖాముఖి కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది.ఈ కార్యక్రమానికి బండి సంజయ్ వెళ్లకుండా ఆపేందుకు పోలీసులు భారీ ఎత్తున సంజయ్ ఇంటికి చేరుకున్నారు. బండి సంజయ్ ఇంటి బయటకు వెళ్తే అక్కడే ఆయనను అడ్డుకోనున్నారు. పోలీసుల తీరును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పు బట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బండి సంజయ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులను , నిరసన గళాలనుు అణచివేసే కుట్రలు చేస్తున్నారన్నారు. అరెస్టులు, అణచివేతలతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను వసూలు చేయనున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి ఆర్టీసీ డీజీల్ సెస్ ను వసూలు చేస్తుంది. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి 125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని యాజమాన్యం పేర్కొంది. అదనపు డీజిల్ సెస్ అనివార్యమని పేర్కొన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు రూపొందించినట్లు బాజిరెడ్డి తెలిపారు.
గతంలో రౌండప్, టోల్‌ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.