Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్.. రెండు రోజుల్లో..

మార్చి 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆలయం మూసి ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో భక్తులకు కొంత ఊరట కలిగించేందుకు టీటీడీ మే 25 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో లడ్డూలను విక్రయించడం ప్రారంభించింది.

huge demand for tirupathi laddu in hyderabad
Author
Hyderabad, First Published Jun 2, 2020, 12:23 PM IST

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూని ఇష్టపడని వారు ఉండరు. కాగా... ఇప్పటి వరకు ఆ లడ్డూ కేవలం తిరుపతి స్వామి వారి దర్శనానికి వెళ్లిన వారికి మాత్రమే దొరికేది. ఇప్పుడు.. హైదరాబాద్ లో కూడా లభిస్తోంది. 

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ టీటీడీ కల్యాణ మండపంలో లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే విక్రయాలు ఆరంభమైన రెండు రోజుల్లోనే 1.35 లక్షల లడ్డూలను విక్రయించామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలకు భక్తుల నుంచి విశేష రీతిలో స్పందన లభించిందని వారు తెలియజేశారు.

మార్చి 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆలయం మూసి ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో భక్తులకు కొంత ఊరట కలిగించేందుకు టీటీడీ మే 25 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో లడ్డూలను విక్రయించడం ప్రారంభించింది. ఇక రెండు రోజుల నుంచి హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలోనూ లడ్డూలను విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున విక్రయశాలలకు చేరుకుని లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక వారి కోసం లడ్డూలను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

కాగా.. టీటీడీ శ్రీవారి లడ్డూలు ఒక్కొక్కటి రూ.25కే విక్రయిస్తోంది. సాధారణంగా ఒక్కో లడ్డూ ధర రూ.50 ఉంటుంది. కానీ సగం రాయితీతో ప్రస్తుతం లడ్డూలను విక్రయిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios