హైదరాబాద్: కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన విజయ్ బాబు కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకొంది.

సంగారెడ్డికి చెందిన విజయ్ బాబు  సైన్యంలో పనిచేసేవాడు. కార్గిల్ యుద్దంలో ఆయన మరణించాడు. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు.

ఈ కేసును హెచ్‌ఆర్‌సీ సుమోటోగా తీసుకొంది. విజయ్ బాబు కుటుంబసభ్యుల పరిస్థితిని చూసి ఈ కేసును సుమోటో గా తీసుకొంది. ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ లోపుగా  నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్ సీ ఆదేశించింది.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శిని విచారణకు ఆదేశించింది. కార్గిల్ యుద్దంలో  విజయం సాధించిన రోజునే హెచ్ఆర్‌సీ ఈ కేసును సుమోటోగా తీసుకొంది.

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన రోజున ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఇవాళ దేశం స్మరించుకొంది. ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు అభినందించారు.