నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్ పక్కా ప్లాన్ తో బాలికను రప్పించి... తన కామవాంఛ తీర్చుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. దీంతో సాజిద్ ఖాన్ తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్లాన్ వివరాలు వెల్లడించారు...
నిర్మల్ : సాయం కోసం వచ్చిన woman ఇంటికి వస్తూ పోతూ ఓ minor girlపై కన్నేశాడు. ఇంటి స్థలం ఉచితంగా ఇప్పిస్తానని ఆశ చూపి, ఆమె సహాయంతో బాలికను బయటకు రప్పించి molestationకి ఒడిగట్టాడు. అత్యంత పకడ్బందీగా సాగిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ Sajid khan, ఆయనకు సహకరించిన మహిళ, కారు డ్రైవర్ ను నిర్మల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి ఉపేంద్రారెడ్డి వివరాలను వెల్లడించారు.
‘నిర్మల్ పట్టణానికి చెందిన ఓ మహిళకు ఆమె తండ్రితో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ విషయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్ ఆమెకు సహకరించేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చి పోయే క్రమంలో సమీపంలో నివసిస్తున్న ఓ బాలిక (16)పై కన్నేశాడు. తన కామవాంఛ తీర్చుకునేందుకు ఆ మహిళ సహాయం కోరాడు. ఇంటి స్థలం నజరానాగా ఇస్తానని ఆశ పెట్టడంతో అతడికి సహకరించేందుకు ఆమె అంగీకరించింది.
పిల్లలతో పాటు హైదరాబాద్ తీసుకు వెళ్లి..
నిజామాబాద్ లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని, బాలికను తనతో పంపించాలంటూ ఆ మహిళ ఆమె తల్లిని కోరింది. తన ఇద్దరు పిల్లలు కూడా తనతో వస్తున్నారని నమ్మబలికింది. ఆమె అంగీకరించడంతో నలుగురు కలిసి ఫిబ్రవరి 9న నిర్మల్ బస్టాండ్ లో నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కారు. పట్టణ శివారులోని సోఫీనగర్ లో బస్సు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కారులో సాజిద్ ఖాన్ వారిని హైదరాబాద్ తీసుకెళ్లాడు.
అర్ధరాత్రి నీళ్ల సీసా పేరుతో గదిలోకి పంపి…
నాంపల్లి రెడ్ హిల్స్ లో ఒక హోటల్ లో మూడు గదులు అద్దెకు తీసుకున్నారు. హోటల్ వారికి అనుమానం రాకుండా మహిళ బుర్కా వేసుకుని ఓకే కుటుంబ సభ్యులుగా నమ్మించింది. ఒక గది లో సాజిద్ ఖాన్, మరో గదిలో డ్రైవర్ జాఫర్ అలియాస్ వసీం, మూడో గదిలో మహిళ ఆమె ఇద్దరు పిల్లలు, బాలిక బసచేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ నీళ్ళ సీసా సాజిద్ ఖాన్ కు ఇచ్చి రమ్మని బాలికను పంపించింది. ఇదే అదనుగా అతను బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. అలా రెండు మూడు సార్లు లైంగికదాడి చేశాడు.
బాలిక సదరు మహిళకు జరిగిన దారుణాన్ని చెప్పగా.. ఎవరికైనా చెబితే చంపేస్తారని భయపెట్టింది. మర్నాడు ఉదయం వారందరికీ సాజిద్ ఖాన్ షాపింగ్ కోసం రూ.8,500 ఇచ్చాడు. మధ్యాహ్నం మళ్ళీ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం అందరూ తిరుగు పయనమయ్యారు. ఇంటికి వచ్చాక జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పి బాలిక బోరుమనడంతో.. ఆమె షాక్ తిన్నది. నమ్మించి తీసుకెళ్లిన మహిళ తో బాదిత బాలిక తల్లి గొడవ పడింది. సాజిద్ ఖాన్ కు ఉన్న పలుకుబడి, బయటపడితే కుమార్తె భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో మదనపడిన బాధిత కుటుంబ సభ్యులు చివరికి బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించారని, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని’ డిఎస్పీ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సాజిద్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టామని, ఇతర కేసులు ఉండటంతో రౌడీషీట్ కూడా తెరిచామని వెల్లడించారు.
