పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే నయం..
తెలంగాణలో పవన్ కల్యాన్ షో అట్టర్ ప్లాఫ్ అయ్యింది. ఎన్నికల్లో పూచికపుల్లగా తీసిపారేశారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా అధికారం కట్టబెట్టలేదు.
తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ పొత్తుతో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేసింది. వారి తరఫున ప్రచారానికి స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కదిలి వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారం చేశారు. ప్రచారంలో పవన్ కల్యాణ్ ఊగిపోయాడు. అవినీతిరహిత తెలంగాణ తేవాలనేది లక్ష్యం అంటూ దంచికొట్టాడు. తెలంగాణ తల్లి తనకు పునర్జన్మనిచ్చిందన్నాడు. తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం.. జనసేన పుట్టిన నేల, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని గౌరవించి ఇన్నాళ్లు ఇక్కడ మాట్లాడలేదంటూ.. సెంటిమెంటుతో ఆయింట్ మెంట్ పూసే ప్రయత్నాలు చేశారు.
ఆయన స్పీచులకు జనం ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు. పెద్ద స్థాయిలో వచ్చి సభను సక్సెస్ చేశారు. కానీ...కట్ చేస్తే సీన్ వేరేలా మారిపోయింది. పవన్ ను సినిమా చూసినట్టుగా చూశారే కానీ.. ఓటు వేయడం దగ్గరికి వచ్చేసరికి నువ్వెవరో? నేనెవరో? అనేశారు. కనీసం నోటాకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు.
నెరవేరనున్న ప్రధాని మోడీ హామీ.. లోక్ సభలోకి వచ్చిన సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లు
పవన్ కంటే జనం బర్రెలక్కను ఎక్కువగా నమ్మారు. సోషల్ మీడియాలో తప్ప తన నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయిందామె. ఆమె తరఫున పెద్ద పెద్ద నాయకులూ ప్రచారానికి రాలేదు. ఆమె పక్షాన ప్రచారం చేసింది కేవలం బర్రెలు మాత్రమే. బర్రెలక్క అనే పేరు మాత్రమే గుర్తింపుగా ముందుకు వెళ్లింది. జనసేనకంటే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే తానే మెరుగని నిరూపించుకుంది.
బర్రెలక్కకు ఐదువేలకు పై చిలుకు ఓట్లు వచ్చాయి. మరోవైపు ఒక్క కూకట్ పల్లిలో తప్ప జనసేనకు మిగతా ఏడు స్థానాల్లో వచ్చిన ఓట్లు నాలుగు వేలు దాటలేదు. పవన్ కల్యాణ్ చేస్తున్న తప్పులేంటో.. ఆయనకు అవగాహనకు రాదు. చెబితే వినని ఓ తిక్కమనిషి.. అన్నీ తనకే తెలుసనుకునే దత్తపుత్రుడు బొక్కా బోర్లా పడ్డాడు. ఇప్పటికైనా ప్రజలు తననెందుకు పదే పదే తిరస్కరిస్తున్నారో ఓ నజర్ వేస్తే.. రానున్న ఏపీ ఎన్నికల్లోనైనా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది.
నెం | నియోజకవర్గం | పార్టీ | మొత్తం ఓట్లు |
1 | తాండూరు | జనసేన | 4087 |
2 | కోదాడ | జనసేన | 2151 |
3 | నాగర్ కర్నూల్ | జనసేన | 1955 |
4 | ఖమ్మం | జనసేన | 3053 |
5 | వైరా | జనసేన | 2712 |
6 | కొత్తగూడెం | జనసేన | 1945 |
7 | అశ్వారావుపేట | జనసేన | 2281 |
8 | కూకట్పల్లి | జనసేన | 39,830 |
9 | బర్రెలక్క (శిరీష) | స్వతంత్ర అభ్యర్థి | 5754 |