తెలంగాణలో క్రిమినల్స్ సంఖ్య ఎన్ని లక్షలో తెలుసా ?

How many criminals are there in Telangana state
Highlights

  • తెలంగాణలో 2లక్షలకు పైగా క్రిమినల్స్
  • సర్వేతో తేల్చిన తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ మొత్తం మీద ఎంత మంది నేరస్తులు ఉన్నారో లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద నేరస్తుల లెక్కలు సేకరించారు. అందుకోసం తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే చేపట్టారు. పోలీసుల సర్వే ఆధారంగా తెలంగాణ లో 2 లక్షల 18 వేల మంది నేరస్తులు ఉన్నట్లు పోలీస్ బాస్ డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

నేరాల నియంత్రణకు త్వరగా కేసుల ఛేదించేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని డిజిపి పేర్కొన్నారు. ఇత రాష్ట్రాల నేరగాళ్ల పైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో మాట్లాడి ఆయా రాష్ట్రాల నేరగాళ్లకు జియో ట్యాగ్ వేస్తామన్నారు. తెలంగాణ జనాలూ... జర జాగ్రత్త ఇప్పటికే ఏ వార్డులో ఎంత మంది నేరస్తులు ఉన్నారు. ఏ కాలనీలో ఎంత మంది నేరస్తులు ఉన్నారో ఇప్పటికే పోలీసులు లెక్కలు తేల్చి చెప్పారు. మరి ఎక్కువ నేరస్తులు ఉన్నా.. తక్కువ నేరస్తులు ఉన్నా.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది మాత్రం జనాలే.

loader