‘ఒవైసీ’ అంటూ ఎన్నాళ్లు ఏడుస్తారు..నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కూడా మాట్లాడండి- అమిత్ షా కు ఒవైసీ స్టాంగ్ కౌంటర్

తన పేరు వ్యాఖ్యానిస్తూ ఇంకా ఎంత కాలం మాట్లాడుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంపై విజన్ లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చేసిన పోస్టులో బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

How long will they cry about 'Owaisi'..Talk about unemployment and inflation too- Owaisi's strong counter to Amit Shah..ISR

తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అని, అయితే ఆ కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం, ఒవైసీ చేతుల్లో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోం మంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన ట్విట్టర్ లో.. ‘‘ ఈ ‘ఓవైసీ’ ఏడుపు ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది?  దయచేసి కొన్ని సార్లు రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కూడా మాట్లాడండి. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ’’ అని ఒవైసీ పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. దానికి మేం సిద్దంగా ఉన్నాం - మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని అన్నారు. నకిలీ ఎన్ కౌంటర్లు, హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, క్రిమినల్స్, బుల్డోజర్లను విడుదల చేయడం మాత్రమే చేయగలదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై అమిత్ షాకు చిత్తశుద్ధి ఉంటే 50 శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు ఎంపీరికల్ డేటాపై ఆధారపడి ఉంటాయి’’ అని ఓవైసీ తన ట్వీట్ లో మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం కోటాను రద్దు చేస్తామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ.. ముస్లిం వ్యతిరేక విద్వేషపూరిత ప్రసంగాలు తప్ప బీజేపీకి ఇవ్వడానికి ఏమీ లేదని అన్నారు.

అమిత్ షా ఏమన్నారంటే ? 
తెలంగాణలోని చేవెళ్లలో ఆదివారం జరిగిన  ‘విజయ్ సంకల్ప్ సభ’ కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరై మాట్లాడారు. ఆ సభలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్లను తొలగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారు అని, కానీ దాని స్టీరింగ్ ఎంఐఎం, ఒవైసీ చేతిలో ఉందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు.

మహిళతో అశ్లీలంగా జార్ఖండ్ మంత్రి వీడియో కాల్.. షేర్ చేసిన బీజేపీ ఎంపీ.. ఇదే కాంగ్రెస్ లక్షణం అంటూ కామెంట్స్..

కేసీఆర్ ప్రధాని కావాలని, దేశమంతా తిరగాలని కలలు కంటున్నారని అమిత్ షా అన్నారు. ప్రధాని కావాలన్న ఆయన కల ఎప్పటికీ నెరవేరదని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని చెప్పారు. 2024లో కూడా నరేంద్ర మోడీ పూర్తి మెజారిటీతో ప్రధాని కాబోతున్నారిన అమిత్ షా జోస్యం చెప్పారు. అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, కేసీఆర్ తెలంగాణను తన కుటుంబానికి ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గత 8-9 ఏళ్లుగా అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios