సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మరణాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటిపర్యంతమవుతున్నారు

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మరణాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణతో తొలి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్న హైదరాబాద్ అబిడ్స్‌లోని ‘‘ఆహ్వానం’’ హోటల్ పరిసరాల్లో ఉదయం నుంచి విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక్కడి థియేటర్, హోటల్ బాధ్యతలను చూసుకునే రోజుల్లో హరికృష్ణ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారని.. అక్కడ పని చేసే సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణానికి సంఘీభావంగా ఆహ్వానం కాంప్లెక్స్‌లోని థియేటర్, షాపులు మూసివేశారు.