పిల్లలకు రక్షణగా ఉండాల్సిన వార్డెన్.. దారుణంగా ప్రవర్తించాడు. హాస్టల్ లో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఈ దారుణ సంఘటన  ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....మావల మండలం మావల శివారు ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ ప్రైం కార్పొరేట్‌ స్కూల్‌ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.

శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.