ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిపై అత్యాచారయత్నం చేశాడో ఎంఎన్ వో.. అది చూసిన మరో ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
భద్రాచలం : మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రబుద్ధులు చేసే పనులు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. తాజాగా తెలంగాణలోని bhadrachalamలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. delivery కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్ లో rape attempt జరిగింది. మత్తుమందు ఇచ్చి pregnantపై MNO లాల్ ఖాన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి.. అతడిని అడ్డుకుని లాల్ ఖాన్ పై సూపర్డెంట్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి సూపర్డెంట్ ఎంఎన్ వోకు లాల్ ఖాన్ కు మెమో జారీ చేశారు. దేశంలో ఇలాంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నో కేసులు ఇలాంటివి నమోదవుతున్నా..కఠిన శిక్షలు విధిస్తున్నా.. అరాచకాలు తగ్గడం లేదు.
కాగా, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి వావివరుసలు తెలియవు అంటారు. అలాగే జార్ఖండ్ కు చెందిన ఓ మృగాడు సొంత చెల్లెళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన తల్లిపై కూడా లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ఆ మాతృమూర్తి తన కొడుకును పోలీసులకు పట్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. లోహార్దాగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కామాంధుడు సొంత చెల్లెళ్ళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక సోదరిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక అరిచి గోల పెట్టింది.
కేకలు విని అక్కను కాపాడేందుకు వచ్చిన చిన్న చెల్లిపై కూడా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మైనర్. విషయం తెలుసుకున్న తల్లి కొడుక్కి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో తల్లిపై కూడా ఆ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు వారిని మెడికల్ టెస్ట్ కోసం పంపించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి Pregnantని చేసిన అన్నను తిరువళ్లూరు Woman police అరెస్టు చేశారు. వివరాలు.. ఆరణి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. అయితే పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సదుపాయం లేకపోవడంతో తిరువళ్లూరు సమీపంలోని రామతండలం గ్రామంలోని పెద్దమ్మ కర్పగం వద్ద ఉంటూ చదువుకుంటోంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్పగం కుమారుడు నాగరాజ్ వరసకు చెల్లెలు అయ్యే Studentకి మాయమాటలు చెప్పి పలుమార్లు molestation చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంలో అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె గర్భం దాల్చినట్టు నిర్థారించారు. దీంతో, బాధిత విద్యార్థిని తలిదండ్రులు తిరువళ్లూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి ఆమె పెద్దమ్మ కొడుకు నాగరాజ్ కారణమని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇదివరకే నాగరాజ్ కు వివాహామై ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.
