గతేడాది మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు గురైన సంఘటన అందరికీ గుర్తుడే ఉంటుంది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో.. అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించాడు.  ప్రణయ్ చనిపోయే నాటికి అమృత.. ఐదునెలల గర్భిణి. కాగా.. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి.. అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు భద్రత కలిపిస్తూనే ఉన్నారు. మరో వైపు  ఈ కేసులో ప్రధాన నిందితులు మారుతీ రావు ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.