మిర్యాలగూడ ప్రణయ్.. హైదరాబాద్ హేమంత్ తెలంగాణలో వరుసగా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కూతురు తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందానే అక్కసుతో అబ్బాయి తండ్రిని అమ్మాయి బంధువులు దారుణంగా హత్య చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లిలో గౌతమి- మహేశ్ అనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఇది తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు మహేశ్ ఇంటిపై దాడి చేశారు.

ఆగ్రహంతో ఊగిపోతూ అబ్బాయి తండ్రిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతను మరణించాడు. గౌతమి- మహేశ్‌లు దసరా రోజున పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే రోజున అబ్బాయి తండ్రిని గౌతమి కుటుంబసభ్యులు కొట్టారు. తీవ్రగాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.