హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని నాయిని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ అని ఆరోపించారు. ఒంటిరిగా పోటీ చేసే సత్తా లేకే కాంగ్రెస్ పొత్తుల కోసం వెంపర్లాడుతోందని విమర్శించారు.