గోదావరి నదిలో హోంగార్డు మృతదేహం, అనుమానాస్పద మృతి

First Published 28, Jun 2018, 4:41 PM IST
home guard suspicious death in peddapalli district
Highlights

గోదావరిఖనిలో దారుణం...

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సమీపంలోని గోదావరి నదిలో ఓ పోలీస్ హోంగార్డు మృతదేహం లభించింది. అయితే ఈ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే... భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తిరుపతి పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతడు నిన్న ఉదయం పనిమీద బైటికి వెళుతున్నానని కుటుంబసభ్యులకు చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు.

అయితే ఇవాళ తిరుపతి గోదావరిఖని పట్టణ సమీపంలోని గోదావరి నదిలో శవమై తేలాడు. గోదావరి నది ఫిల్టర్ బెడ్ వద్ద గల నీటిలో ఇతడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడిఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అనుమానాస్పద మృతిగా కేసుమ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిని ఎవరైనా హత్య చేశారా లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.

 

loader