హైదరాబాద్:హైద్రాబాద్ పట్టణంలోని అడ్డగుట్టలో బాలికపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.బాలిక తల్లిదండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీఎస్ లో హోంగార్డు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు  ఆమెను ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

హోంగార్డు మల్లిఖార్జున్ బాలికపై అత్యాచారం చేసిన విషయాన్ని బాలిక కుటుంబసభ్యులకు తెలిపింది.బాలికకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు.  బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  హోంగార్డు పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని  ప్రజా సంఘాలు కోరుతున్నాయి. 

సభ్య సమాజాన్ని రక్షించాల్సిన పోలీసు విధుల్లో ఉన్న హొంగార్డు బాలికపై అత్యాచారం  చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నిందితుడిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించనున్నారు.