Asianet News TeluguAsianet News Telugu

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేసుల్లేని అమాత్యులు ముగ్గురే.. అత్యధికంగా కేసులు సీఎంపైనే..

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేసుల్లేని మంత్రులు ముగ్గురే ముగ్గురు. మంత్రివర్గంలో అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉన్నవి సీఎం రేవంత్ రెడ్డిపైనే. ఆయనపై ఏకంగా 89 కేసులు ఉన్నాయి. సీఎం సహా మొత్తం 9 మంత్రులపై 136 కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
 

highest cases against cm revanth reddy, no cases against only three ministers kms
Author
First Published Dec 11, 2023, 5:17 AM IST

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 12 మంది అమాత్యులతో కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో మెజార్టీ మంత్రులపై కేసులు ఉన్నాయి. కేవలం ముగ్గురు మంత్రులు మినహాయిస్తే మిగిలిన 9 మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి పై అత్యధికంగా కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

సీఎం సహా 9 మంది మంత్రులపై మొత్తం 136 కేసులు ఉన్నట్టు ఏడీఆర్ ఓ నివేదికలో వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు ఉండగా.. అందులో 50 కేసులు తీవ్రమైన క్రిమినల్ కేసులు. మరో ఐదుగురు మంత్రులు కూడా తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లలో వెల్లడించారు.

ఎవరిపై ఎన్ని కేసులు:

సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అత్యధిక కేసులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై 11 కేసులు, పొన్నం ప్రభాకర్ పై 7 కేసులు ఉన్నాయి. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కలపై 6 చొప్పున కేసులున్నాయి. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలపై 5 కేసుల చొప్పున, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావులపై 3 కేసులు నమోదయ్యాయి.

Also Read: Revanth Anna: రేవంత్ అన్నా.. రేవంత్ అన్నా! పిలవగానే మహిళ వద్దకు సీఎం.. సమస్య విని పరిష్కారానికి ఆదేశం(Video)

ఈ ముగ్గురిపై కేసుల్లేవ్:

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముగ్గురిపై కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు పేర్కొన్నాయి. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై కేసులు లేవని ఈ సంస్థలు వెల్లడించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios