Asianet News TeluguAsianet News Telugu

వామనరావు దంపతుల హత్యకేసు... నేడు కీలక పరిణామం

హైకోర్టు లాయర్ వామనరావు-నాగమణి దంపతుల హత్యకేసుల ఇవాళ(శుక్రవారం) కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశముంది.  

highcourt lawyers vamanarao couple murder case updates
Author
Manthani, First Published Feb 26, 2021, 10:23 AM IST

మంథని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ వామనరావు-నాగమణి దంపతుల హత్యకేసుల ఇవాళ(శుక్రవారం) కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశముంది. ఈ హత్యకు ఉపయోగించిన కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. ఈ కత్తులను ఇవాళ బ్యారేజీలోంచి బయటకు తీసే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాయర్ వామన్‌రావు హత్యకు 4 నెలల క్రితమే బిట్టు శ్రీను ప్లాన్ చేశాడట. వామన్ రావు బతికుంటే ఎప్పటికైనా సమస్యని కుంట శ్రీను, బిట్టు శ్రీనులు భావించారు. 

బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌పై కేసులు వేశాడు వామన్ రావు. గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి వామన్ రావు హత్యకు రెక్కీ నిర్వహించింది శ్రీను గ్యాంగ్. అయితే వామన్ రావు చుట్టూ జనాలు ఎక్కువగా వుండటంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

read more   వామనరావు దంపతుల హత్య... కత్తులు తయారుచేసింది ఆ ముగ్గురే

17న వామన్ రావు ఒంటరిగా దొరకడంతో హత్యకు ప్లాన్ గీశారు. హత్య తర్వాత బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి వామన్ రావు దంపతులు చనిపోయారని కుంట శ్రీను చెప్పాడు. మర్డర్ తర్వాత కుంట శ్రీను గ్యాంగ్‌ను మహారాష్ట్ర వెళ్లాలని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు.

అయితే హత్య తర్వాత రెండ్రోజులు ఇంట్లోనే మకాం వేసింది గ్యాంగ్. హత్యకు ముందు వేరే సిమ్‌లు కొనుగోలు చేసింది. కాగా, ప్రధాన నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ  జరిపిన మంథని కోర్టు.. అందుకు అనుమతించింది. దీంతో వారం రోజుల పాటు వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios