సెప్టెంబర్ రెండో తేదీన రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు శుక్రవారం నాడు హైకోర్టు  లైన్ క్లియర్ చేసింది.ఈ సభను నిలిపివేయాలంటూ  హైకోర్టులో దాకలైన  పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.


హైదరాబాద్: సెప్టెంబర్ రెండో తేదీన రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు శుక్రవారం నాడు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది.ఈ సభను నిలిపివేయాలంటూ హైకోర్టులో దాకలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

నాలుగేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గాను ప్రగతి నివేదన సభను నిర్వహించాలని టీఆర్ఎస్ తలపెట్టింది.

ఈ సభను నిర్వహించకూడదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు హైకోర్టు కొట్టేసింది. దీంతో సభ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

ప్రగతి నివేదన సభ నిర్వహించకూడదంటూ పర్యావరణ పరిరక్షణ సమితి తరుపు శ్రీధర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు . ఈ సభ కారణంగా పర్యావరణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పిటిషన్‌లో శ్రీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై పర్యావరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటున్నట్టుగా హైకోర్టుకు నివేదించడంతో శ్రీధర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.