మెదక్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

మెదక్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో రైల్వేస్టేషన్‌ను ప్రారంభించాల్సి వుండగా.. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ నుంచి అక్కన్నపేట మధ్య మూడు రైల్వేస్టేషన్లను కొత్తగా నిర్మించారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ అక్కన్నపేట మధ్య రైలును ప్రారంభించారు.