Asianet News TeluguAsianet News Telugu

ఇంటి స్థలం , లోన్లు ఇస్తామంటూ మోసం : భగ్గుమన్న మహిళలు.. మహాభారత్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లో రవీంద్రభారతి దగ్గర జై మహా భారత్ పార్టీ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై మహాభారత్ పార్టీ నిర్వాహకులు. ఒక్కొక్కరికి 200 గజాల ల్యాండ్ ఇస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

high tension at jai mahabharat party office in hyderabad ksp
Author
First Published Sep 20, 2023, 2:16 PM IST

హైదరాబాద్‌లో రవీంద్రభారతి దగ్గర జై మహా భారత్ పార్టీ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ల్యాండ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారు జై మహాభారత్ పార్టీ నిర్వాహకులు. ఒక్కొక్కరికి 200 గజాల ల్యాండ్ ఇస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తాము మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణును నిలదీశారు మహిళలు. తమకు భూమి, లోన్లు ఇస్తామని మోసం చేశారని మహిళలు ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios