హైదరాబాద్ మీర్‌పేటలోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరగంట ముందుగానే ఇన్విజిలేటర్ పరీక్షా పేపర్లు లాక్కోవడంతో అభ్యర్ధులు ఆందోళనకు దిగారు.  

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది. నిమిషం లేటైనా లోపలికి అనుమతించకపోవడంతో అభ్యర్ధులు నిరాశకు లోనయ్యారు. అయితే హైదరాబాద్ మీర్‌పేట్‌లోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం అయిపోవడంతో అరగంట ముందుగానే పేపర్లు తీసుకున్నాడు ఇన్విజిలేటర్. అయితే బయటకు వచ్చాక అరగంట టైం వుందని అబ్జర్వర్ తెలిపారు. దీంతో తమ పేపర్ తమకు ఇవ్వాలని అభ్యర్ధులు ఇన్విజిలేటర్‌ను రిక్వెస్ట్ చేశారు. అయితే పేపర్లు తిరిగి ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ ఆవరణలో సుమారు 40 మంది అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.