సికింద్రాబాద్ అల్లర్లల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది.
సికింద్రాబాద్ అల్లర్లల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ముందు గేటు నుంచి వస్తే అడ్డుకుంటారని తెలిసి వెనుక గేటు నుంచి అక్కడికి చేరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాకను అప్పటికే గమనించిన పోలీసులు... ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది.
