నియామకాల్లో అవకతవకలు నిజమైతే తామే రిక్రూట్మెంట్ కేన్సల్ చేస్తామని హైకోర్టు ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కానిస్టేబుల్ నియామకాల్లో అన్యాయం జరిగిందని అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా హైకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది.

రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

63 మార్కులు వచ్చిన హోంగార్డుకు ఓపెన్‌ కేటగిరీలో ఏలా ఉద్యోగం ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

14 ఎఫ్‌ లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే వారికి అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులిచ్చామని ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పష్టం చేయగా... పిటిషనర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ముందు

సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

కానిస్టేబుల్ గా ఎంపికైకన హోంగార్డుల విషయంలో పూర్తి స్పష్టత వచ్చేవరకు 188 మంది హోంగార్డుల అపాయింట్‌మెంట్‌ ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. అయితే మిగిలిన వారి నియామకాలను షరతులకు లోబడి చేసుకోవచ్చని సూచించింది.

జిల్లా వారీ ఏబీసీడీ కేటగిరీల నిబంధనల మేరకు ఎలా అపాయింట్‌మెంట్‌ చేపట్టారో రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సక్రమంగా జరగలేదని భావిస్తే నోటిఫికేషన్ రద్దు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.