టీచర్లకు షాక్: ఏకీకృత సర్వీస్ రూల్స్ చెల్లవన్న హైకోర్టు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 28, Aug 2018, 11:16 AM IST
High court shocks to teachers unified service rules
Highlights

ఏకీకృత సర్వీస్ రూల్స్ చెల్లవని హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.  పంచాయితీ రాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే సర్వీస్ రూల్స్ వర్తంచవని కోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్:  

హైదరాబాద్:  ఏకీకృత సర్వీస్ రూల్స్ చెల్లవని హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.  పంచాయితీ రాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే సర్వీస్ రూల్స్ వర్తంచవని కోర్టు స్పష్టం చేసింది.

ఏకీకృత సర్వీస్ రూల్స్‌  చెల్లవని  మంగళవారం నాడు తీర్పు చెప్పింది.పంచాయితీ రాజ్, ప్రభుత్వ టీచర్లకు ఓకే సర్వీస్ రూల్స్  ఉండాలని కోరుతూ ఏకీకృత సర్వీస్  రూల్స్ కోసం  ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నాయి.

ఏకీకృత సర్వీస్ రూల్స్ లేని కారణంగా  కొందరు టీచర్లను ప్రమోషన్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు  ఉపాధ్యాయ సంఘాల్లో చాలా కాలంగా ఉంది. దీని కోసం  ఏకీకృత సర్వీస్ రూల్స్ కావాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

తాజాగా ఏకీకృత సర్వీస్ రూల్స్‌ చెల్లవని  హైకోర్టు తీర్పు చెప్పింది.  పంచాయితీరాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే సర్వీసు రూల్స్ వర్తించవని కోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో టీచర్ల ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా జరుగుతోంది.పంచాయితీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లుగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయితీరాజ్ టీచర్లను  స్థానిక సంస్థల ద్వారా ఎంపిక సాగుతోంది. ప్రభుత్వ టీచర్లను ప్రభుత్వం నేరుగా నియమిస్తోంది. 

 పంచాయితీ రాజ్ టీచర్లు 90కు పైగా టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

రాష్ట్రపతి ఉత్తర్వులను తప్పుబడుతూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి కానీ, దానికి విరుద్దంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయంలో రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్ ను ప్రభుత్వ టీచర్లు తప్పుబట్టారు. ఈ విషయమై ప్రభుత్వ టీచర్లు హైకోర్టు

371 డీ ఆర్టికల్ ను సవరిస్తూ గత ఏడాది జూన్ లో  రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. 1998 నవంబర్ నుండి ఈ సవరణ వర్తిస్తోందని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం తెలంగాణ సర్కార్ కేంద్రంలో లాబీయింగ్ చేసింది. ఈ మేరకు  ఉత్తర్వులు వెలువడ్డాయి.

పంచాయితీరాజ్ టీచర్లలో  ప్రమోషన్లలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు తీర్పు వెలువర్చడంతో పంచాయితీరాజ్ టీచర్లకు నిరాశే మిగిలింది.

 ప్రభుత్వ టీచర్లు ఎస్జీటీగా జాయిన్ అయితే  విద్యాశాఖ డైరెక్టర్‌గా కూడ పదోన్నతులు పొందుతున్నారు. పంచాయితీరాజ్ టీచర్లు మాత్రం ఎస్జీటీగా జాయిన్ అయితే తాను రిటైరయ్యే సమయానికి ఎంఈఓగా మాత్రమే రిటైరయ్యే పరిస్థితులున్నాయని టీచర్ సంఘాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో సుమారు లక్షకు మందికిపైగా పంచాయితీరాజ్ టీచర్లు విధుల్లో ఉన్నారు. కేవలం పదివేల మందికి పైగా మాత్రమే  ప్రభుత్వ టీచర్లు ఉన్నారు.అయితే ఒకే రకమైన  హోదాలో ఒకే సారి పంచాయితీరాజ్, ప్రభుత్వ టీచర్లుగా చేరితే...రిటైరయ్యే సమయానికి వేర్వేరు హోదాల్లో వేర్వేరు ప్యాకేజీల్లో రిటైరౌతున్నారు. 

తాజాగా హైకోర్టు తీర్పుతో  ప్రమోషన్ల విషయంలో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని   పంచాయితీరాజ్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రభుత్వ టీచర్లకు న్యాయం జరిగే అవకాశం లేకపోలేదని పంచాయితీరాజ్ టీచర్లు అభిప్రాయపడుతున్నారు.

ఏకీకృత సర్వీస్ రూల్స్ కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడ చెల్లవని హైకోర్టు చెప్పడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే ఈ విషయమై  పంచాయితీరాజ్ టీచర్లు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
 

loader