మొయినాబాద్ ఫామ్ కేసును దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.
మొయినాబాద్ ఫామ్ కేసును దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశాలు ఆదేశించింది.
సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చూడేలని హైకోర్టు తెలిపింది. దర్యాప్తు వివరాలను మీడియా, ప్రభుత్వ వర్గాలు, రాజకీయ నాయకులకు వెల్లడించొద్దని ఆదేశించింది. దర్యాప్యు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు విషయంలో మర్యాద, గోప్యతను కాపాడుకోవడం సిట్ చైర్మన్ బాధ్యత అని పేర్కొంది.
అయితే ఈ కేసుకు సంబంధించి సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో తెలంగాణ హోం శాఖ సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే సిట్ విచారణపై కూడా బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ తమ పిటిషన్‌ను ముందుగా నిర్ణయించకుండా సింగిల్ జడ్జి తెలంగాణ పోలీసుల విచారణకు అనుమతించడం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులు ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. వీరికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం వుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది.
