హైదరాబాద్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించిన రెవిన్యూ అధికారులకు హైకోర్టు షాకిచ్చింది. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశించింది.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో రెవిన్యూ అధికారులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయడంలో రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా హైకోర్టు అభిప్రాయపడ్డింది. 

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆదేశాలను రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు.

భూ ,నిర్వాసితుల బాధితులకు పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన తొగుట ఆర్డీఓ, తహసీల్దార్లకు రెండు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. అంతేకాదు  ఈ ఇద్దరిని సస్పెండ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహరంలో సిద్దిపేట జిల్లా తోగుట్ట ఆర్డీవో, తహశీల్దార్ కు 2 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానాతో పాటు సస్పెన్షన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది.గజ్వెల్ ఆర్డీవో డి.విజేందర్ రెడ్డి, కొండపాక్ తహశీల్దార్ ప్రభు లకు కోర్టు శిక్ష విధించింది.